![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియస్ సోమవారం నాటి ఎపిసోడ్ -856 లో.... రాజ్ భోజనం చెయ్యకుండా నిరాహార దీక్ష చేస్తాడు. ఆయన అలా తినకుండా పడుకున్నాడు.. మీరు వెళ్ళి ఈ భోజనం ఆయనకి ఇవ్వండి అని కృష్ణమూర్తితో కావ్య అంటుంది. అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఈ గొడవలు అని కృష్ణముర్తి అడుగుతాడు. ఆ విషయం ఆయన దగ్గరికి వెళ్లి అడగండి అని కావ్య అంటుంది. రాజ్ కి కృష్ణమూర్తి భోజనం తీసుకొని వెళ్తాడు.
ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చాను అల్లుడు పర్లేదు తిను అనగానే రాజ్ తింటాడు. నా కూతురు కోసం ఇంత చేస్తున్నావ్ అసలు నువు అబార్షన్ చేయించుకోమనడానికి కారణం చెప్పొచ్చు కదా అని కృష్ణమూర్తి అనగానే చెప్పలేను మావయ్య అని రాజ్ అంటాడు. రాజ్ ఆలా తనకోసం నిరాహార దీక్ష చేస్తుంటే కావ్య బాధబడుతుంది. భోజనం చేయకుండా ఉంటే కనకం వచ్చి భోజనం తినేలా చేస్తుంది. ఆ తర్వాత అపర్ణకి కనకం ఫోన్ చేసి అల్లుడు గారిని చూసి ఇది మనసు మార్చుకునేలా ఉందని కనకం చెప్పగానే అలా మారకుండా చూడమని అపర్ణ అంటుంది. రేపు దీపావళి కదా మీరు అందరు ఇక్కడికి వచ్చెయ్యండి అని కనకం అనగానే అపర్ణ సరే అంటుంది.
అదంతా రుద్రాణి విని మనం కూడా వెళ్ళాలని రాహుల్ తో చెప్తుంది. మరుసటి రోజు రాజ్ లేచేసరికి దుగ్గిరాల కుటుంబం మొత్తం తన ముందు ఉంటుంది. స్వరాజ్ వెళ్లి రాజ్ తో మాట్లాడుతాడు. తరువాయి భాగంలో అప్పు స్పృహ తప్పి పడిపోతే డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. ఎందుకు టాక్సిక్ గల క్రాకర్స్ కాల్చారని డాక్టర్ అంటుంది. రాజ్ నువ్వే కదా కావ్య కోసం అలా చేసావని రుద్రాణి అంటుంది. ఎందుకు నా బిడ్డని చంపాలనుకుంటున్నారని రాజ్ చొక్కా పట్టుకొని కావ్య నీలదీస్తుంటే ఎందుకు అంటే నువ్వు చస్తావ్ కాబట్టి అని రాజ్ నిజం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |